చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు.. ఇళ్లలోకి పారిపోయి తలుపులు వేసుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • చంద్రబాబు ప్రలోభాలకు తెరతీశారు
  • యువకులకు బైకులు, మహిళలకు పసుపు-కుంకుమ ఇస్తున్నారు
  • టీడీపీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు రావడం లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రచార వాహనాలు గ్రామాలకు వెళుతుంటే ప్రజలు తలుపులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో చంద్రబాబు ప్రలోభాలకు తెరతీశారనీ, పసుపు-కుంకుమ చీరలు, యువకులకు బైక్ లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పంచుతున్న వీటిని తీసుకోవాలనీ, ఎందుకంటే ఈ డబ్బును ప్రజల నుంచే టీడీపీ నేతలు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు. ప్రచార వాహనాలు గ్రామాలకు వెళితే ప్రజలు తలుపులు మూసుకుంటున్నారు. దాంతో ప్రలోభాలకు తెరతీశాడు. పసుపు కుంకుమ చీరలు, యువకులకు బైకులు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నాడు. అన్నీతీసుకోండి. ఎందుకంటే మీనుంచి దోచుకున్నడబ్బే. ఓటు ఫ్యాను గుర్తుకు వేయండి’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Twitter
Jagan
YSRCP
Vijay Sai Reddy

More Telugu News